Sunday, May 5, 2024
- Advertisement -

రేణు దేశాయ్‌ నిశ్చితార్థం ఎవరితో జ‌రిగిందో తెలుసా?

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ నిశ్చితార్థం ఆదివారం సాయంత్రం ఘ‌నంగా జరిగింది. బ‌ద్రి సినిమా టైంలో వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. త‌రువాత కొన్నాళ్లు సహజీవనం చేశాక 2009లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. త‌రువాత వీరి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు వ‌చ్చాయి.పవన్‌, రేణు 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యా ఉన్న విషయం తెలిసిందే.

పవన్‌ కల్యాణ్‌ నుంచి విడాకులు తీసుకున్నాక ఒంటరిగా ఉంటున్న రేణు ఇటీవలే మళ్లీ ప్రేమలో పడ్డానంటూ ట్వీటర్‌లో పోస్ట్‌లు పెట్టారు. రేణు ఆదివారం నిశ్చితార్థం జరిగాక కూడా కాబోయే భర్త పేరు, ఇతర వివరాలు బయటపెట్టలేదు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించి రెండు ఫొటోలు షేర్‌ చేశారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -