Monday, May 6, 2024
- Advertisement -

తెలుగు మీడియా కాదు…… ఎపి నెక్ట్స్ సిఎం జగన్….. తేల్చేసిన గూగుల్

- Advertisement -

భజన మీడియా ఆంద్రజ్యోతిలో 2019 ఎన్నికల్లో కూడా టిడిపిదే విజయం……బాబే సిఎం అని సర్వే కథలు రాయించుకుని సంబరపడుతున్న బాబు అండ్ కోకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గూగుల్. గతంలో కూడా పప్పు అంటే లోకేష్ అని గూగుల్ చెప్పడంతో టిడిపి వర్గాలన్నీ గూగుల్‌పై విరుచుకుపడ్డాయి. ఇఫ్పుడు అంతకుమించిన షాక్‌ని తెలుగు తమ్ముళ్ళు ఫేస్ చేస్తున్నారు. వైకాపా వర్గాలు మాత్రం సంబరపడిపోతూ సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో నంబర్ ఒన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అని సెర్చ్ చేస్తే నారా చంద్రబాబునాయుడు అనే చూపిస్తోంది. అయితే 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని సెర్చ్ చేస్తే మాత్రం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేరుతో పాటు ఆయన ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమే పచ్చ వర్గాలకు కిర్రెక్కిస్తోంది. జాతీయ స్థాయి మీడియా సర్వేలన్నీ కూడా 2019లో వైకాపాదే గెలుపు అని తేల్చేసిన నేపథ్యంలో సొంత భజన మీడియా ఆంద్రజ్యోతిలో ఏదో సర్వే చేయించాం అని చెప్పి 2019లో టిడిపిదే గెలుపు……బాబే సిఎం అని కథలు చెప్పారు.

అయితే సదరు సర్వే సంస్థ మాత్రం ఆంద్రజ్యోతిపై పరువు నష్టం దావా వెయ్యడానికి రెడీ అవుతోందిప్పుడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గూగుల్ కూడా 2019 తర్వాత వైఎస్ జగనే సిఎం అని చెప్పెయ్యడం బాబు అండ్ కోకి టెన్షన్ ఓ రేంజ్‌లో పెంచుతోందని ప్రత్యేకంగా చెప్పాలా? ఇక ఇప్పటికే ప్రజా సంకల్పయాత్ర సక్సెస్, జాతీయ స్థాయి సర్వేల నివేదికలతో ఫుల్ ఖుషీగా ఉన్న వైకాపా శ్రేణులకు 2019తర్వాత జగనే సిఎం అన్న గూగుల్ వార్త కూడా ఫుల్ హ్యాపీనెస్ ఇస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -