మెగా పవర్‌స్టార్ ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కమర్షియల్‌గా బోయపాటి స్టైల్లో తెరకెక్కుతుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ ను పెట్టనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ టైటిల్ తో చిరంజీవి సినిమా ఉండటం వలన, అందరిలో ఆసక్తి పెరిగింది.
తాజాగా ఈ సినిమాకు పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు అనే పేరును పెట్టాలనే ఆలోయనలో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కల్యాణ్‌కు తమ్ముడు సినిమా మంచి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బోయపాటి కథకు కూడా ఈ టైటిల్ సెట్ అవుతుందని భావిస్తున్నారని సమాచారం. పైగా ఈ టైటిల్ పెడితే సినిమాకు క్రేజ్ వస్తుందని ఆలోచిస్తున్నారు చిత్ర దర్శక-నిర్మాతలు.
