Sunday, June 16, 2024
- Advertisement -

ఆక‌ట్టుకుంటున్న ‘రథం’ ట్రైల‌ర్‌

- Advertisement -

కొత్త హీరో,హీరోయిన్లు అయిన గీత్ ఆనంద్, చాందినీ భగ్వానాని జంట‌గా న‌టించిన చిత్రం ‘రథం’. కె.చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజ‌ర్‌ను గ‌తంలోనే విడుద‌ల చేశారు.టీజ‌ర్‌కు మంచి స్పంద‌న రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతులు మీదుగా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ట్రైల‌ర్‌లో ఎక్కువ యాక్ష‌న్ స‌న్నివేశాల‌పై క‌ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్‌లో డైలాగులు, పోరాట సన్నివేశాలు, విజువల్స్ చూస్తుంటే మంచి క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ ట్రైలర్ చివరిలో హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘‘18 రోజుల యుద్ధం, లక్షల శవాలు.. కురుక్షేత్ర యుద్ధం కూడా ధర్మం కోసమే..’’ అంటూ.. రక్తికట్టించారు. ‘పెద్దంతరం.. చిన్నంతరం లేకుండా పెంచిందా బాబూ మీ అమ్మ. గుమ్మం ముందుకు వచ్చి రొమ్ము విసురుతున్నావేంటి?’’, ‘‘మంచోడు పక్కింట్లో ఉంటే మనోడు అంటాం. అదే వాడు మన ఇంట్లో ఉంటే ఇవన్నీ మనకు ఎందుకు రా అంటాం’’ వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -