Monday, May 6, 2024
- Advertisement -

సర్దార్ సెట్స్ పై… పవన్ కూతుళ్లు కూడా..!

- Advertisement -

పవన్ కల్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా షూటింగ్ స్పాట్ కు సంబంధించి విడుదలైన ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ సినిమా క్యాస్ట్ తో కలిసి పవన్ సరదాగా గడిపిన పోజులు  అభిమానులను అలరిస్తున్నాయి. వాటని షేరింగ్ చేసుకుంటూ వారు ఆనందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉంటే.. కేవలం సినిమా క్యాస్ట్ కు సంబంధించే కాదు.. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ పై పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు కూడా హల్ చల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ప్రత్యేకించి పవన్ కల్యాణ్ కూతుళ్లిద్దరూ ఈ సినిమా సెట్స్ పై కి తరచుగా వస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ రెండో భార్య కూతురు ఆద్య, మూడో భార్య కూతురు పొలెనా ఈ సినిమా సెట్స్ ను విజిట్ చేస్తున్నారు. గుజరాత్ లో షూటింగ్ లో ఉన్న తండ్రితో సరదాగా గడిపి వెళుతున్నారు. ఈ సినిమా యూనిట్ ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ విషయం తెలుస్తోంది. ఈ విధంగా పవన్ ఒకవైపు సినిమాతో బిజీగా ఉండగానే.. తన కూతుళ్లకు కూడా కావాల్సినంత  సమయాన్ని కేటాయిస్తున్నాడు. పవన్, రేణూదేశాయ్ కూతురు ఆద్య అయితే.. సెట్స్ పై చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ నెల 17తో ఈ సినిమా యూనిట్ అక్కడ షూటింగ్ ను ముగించుకుని హైదరాబాద్ రానున్నట్టుగా తెలుస్తోంది.

Why mega heroes scared of Pawan Kalyan? 

{youtube}D_TcVyxdX5M{/youtube}

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -