Sunday, May 19, 2024
- Advertisement -

రిలేషన్.. కన్ ఫ్యూజన్!

- Advertisement -

పైకి మాత్రం అంతా కలిసున్నట్టే కనిపిస్తారు. కానీ.. టైమ్ దొరికితే ఎవరో ఒకరు తమ పొత్తు అసలు రంగును బయటికి తీస్తారు. 

అధినేతల స్థాయిలో అంతా బానే ఉన్నా… కేడర్ విషయంలో మాత్రం అలాంటి ఐక్యత లేక పోవడం ఆ ఇద్దరి బంధం, అనుబంధంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ కూటమి విషయంలో ఉన్న ఈ అయోమయం.. జనంలో కూడా కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా నుంచి మొదలు పెడితే.. చాలా విషయాల్లో 2 పార్టీల సంబంధాలు క్లారిటీ లేకుండా పోతున్నాయి. టీడీపీతో పొత్తు కారణంగా నష్టపోయామంటూ.. ఈ మధ్యే బీజేపీ నాయకుడు ఒకరు కామెంట్ చేయడం కూడా.. వాళ్ల రిలేషన్స్ ఎలా ఉన్నాయో పరోక్షంగా స్పష్టం చేస్తోంది.

ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ కార్యక్రమం అమలు చేసినా.. ఎవరికి వారు క్రెడిట్ కోసం రాజకీయాల్లో పాకులాడడం కామన్. ఏపీలో అదే విషయం.. టీడీపీ బీజేపీ సంబంధాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ విద్యాసంస్థల ప్రారంభ కార్యక్రమాల నుంచి అమరావతి శంకుస్థాపన వరకు.. ఎలాంటి కార్యక్రమమైనా.. ఇదే తంతు రిపీట్ అవుతోంది.

ఏపీకి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పడం.. బీజేపీ కారణంగానే ఏపీకి లాభం జరుగుతోందని వీలున్న ప్రతి వేదికపైనా.. ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే.. టీడీపీ కూడా తమ ప్రయత్నాల వల్లే ఏపీకి అన్ని విద్యాసంస్థలు వస్తున్నాయని, కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని అధినేత బాబు నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ చెప్పుకుంటూ పోతున్నారు.

పైకి చూస్తే నేతలంతా కలిసున్నట్టే కనిపిస్తున్నా.. ఎవరికి వారు ప్రజల్లో మైలేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్న విషయం.. రాజకీయాలతో టచ్ ఉన్న ఎలాంటి వారికైనా అర్థమయ్యేదే. ఈ స్నేహపూర్వక ఆధిపత్య పోరాటం.. ఇలాగే కంటిన్యూ అయితే.. వచ్చే ఎన్నికల నాటికి 2 పార్టీలు ఉప్పూనిప్పులా మారే అవకాశాలు చాలా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ విశ్లేషిస్తున్నాయి.

ఈ రాజకీయాలతో సామాన్య జనానికి పనికొచ్చేది ఏదీ లేకపోయినా.. వీటి కారణంగా కోట్లాది ఆంధ్రుల కల.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం అటకెక్కుతున్న విషయం స్పష్టమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఎప్పుడో ఒకప్పుడు ప్రజాగ్రహం రుచిచూడాల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ, బీజేపీలను కొందరు అప్రమత్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -