Tuesday, April 30, 2024
- Advertisement -

పవన్ సినిమాకి రంగం సిద్ధమైంది!!

- Advertisement -

పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసమే సర్దార్ గబ్బర్ సింగ్ లో చాలా సన్నివేశాలు చేశాడు. ఈ సినిమాని వారికి అంకితం కూడా చేశాడు. కానీ అనుకున్న ఫలితం మాత్రం సాధించలేకపోగా….విమర్శలు కూడా వచ్చాయి. దాంతో తదుపరి సినిమా విషయంలో పవన్ తన ప్లాన్స్ మార్చుకున్నాడు. తన తదుపరి సినిమాని ఎస్.జే సూర్యతో చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అందిచే లవ్ స్టొరీ ఇది. దీన్ని ఇప్పుడు స్టార్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల చేయాలనీ పవన్ ఒకప్పటి ఆలోచన. కానీ సర్దార్ ఫలితం తేడా రావడంతో…ఈ ప్రాజెక్ట్ విషయంలో స్పీడు పెంచాలని డిసైడ్ అయ్యాడు పవన్. ఇప్పుడు ఎస్ జే సూర్యతో మూవీ ఈ నెల 29 నే లాంచ్ కానున్నట్లు సమాచారం. రాబోయే సంక్రాంతి నాటికే విడుదల చేసేయాలన్నది లేటెస్ట్ అయిడియా.

అలాగే ఈ సినిమాని… సర్దార్ ని అమ్మిన డ్రిస్టిబ్యూటర్లకే ఇస్తారట కూడా. అది కూడా డిస్కౌంట్ రేట్లకే ఇవ్వడం ద్వారా.. సర్దార్ నష్టాలను భర్తీ చేయాలని పవన్ చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాని డిస్కౌంట్ రేట్లకు దక్కించుకోగలగడం అంటే.. అది ఆల్మోస్ట్ జాక్ పాట్ అనే చెప్పాలి. ఇలా సర్దార్ తో నష్టపోయిన డ్రిస్టిబ్యూటర్లకు.. పవన్ పొంగల్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -