Saturday, May 4, 2024
- Advertisement -

త‌న రేటును భారీగా పెంచిన పాయ‌ల్ రాజ్‌పుత్‌…ఎంతంటె…?

- Advertisement -

ఇప్పుడు ప్రడ్తుటం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఏమిటి అంటే, ఒక్క హిట్ పడగానే, హీరోలకి మేమేం తక్కువ కాదు అన్నట్టు అమాంతం త‌మ రెమ్మున‌రేష‌న్‌ను పెంచేస్తున్నారు హీరోయిన్‌లు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే సామెతని బాగా ఫాలో అవుతున్నారు యంగ్ హీరోయిన్స్.

తెలుగులో ఈ మధ్యకాలంలో దూసుకొచ్చిన అందాల కథానాయికలలో ఒకరిగా పాయల్ రాజ్ పుత్ కనిపిస్తుంది. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ఈ సుందరి గ్లామర్ పరంగా యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని బోల్డ్ బ్యూటీగా పాయల్ కి టాలీవుడ్ లో గుర్తింపు ఉంది. ఆరంభమే ఆర్.ఎక్స్ 100 చిత్రంలో బెడ్ రూమ్ సన్నివేశాలు.. పెదవి ముద్దులతో యూత్ గుండెల్ని కొల్లగొట్టింది.

మొదటి సినిమాతోనే ముచ్చెమటలు పట్టించిన ఈ అమ్మడికి వరుసగా కిర్రెక్కించే ఆఫర్లు వచ్చి పడ్డాయ్. ఇక తెలుగులో ‘వెంకీమామ’ .. ‘డిస్కోరాజా’ .. ‘మన్మథుడు 2’ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ సినిమా కోసం ఆమెను సంప్రదించగా, పారితోషికంగా ఆమె 75 లక్షలు అడిగిందని అంటున్నారు. షాక్ తిన్న నిర్మాతలు వేరొక భామ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది.

ఇప్పుడు పాయల్ రేంజ్ ఏంటి అంటే, సౌత్ లో మూడు భాషల్లో క్రేజీ ఆఫర్స్ తో ఫుల్ డిమాండ్ లో ఉన్న టాప్ హీరోయిన్. ఓవైపు మాతృభాష పంజాబీలో బిజీ. మరోవైపు తెలుగు- తమిళం- హిందీలోనూ అవకాశాలు అందుకుంటోం. ఇన్ని క్రేజీ ఆఫర్స్ చేతిలో ఉంటె, రేట్ పెచ్చడం లో తప్పేముంది అంటున్నారు పాయల్ సన్నిహితులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -