పాయల్ రాజ్ పుత్ …గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోన్న పేరు ఇది. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికి స్టార్ హీరోయిన్‌కు వచ్చినంత క్రేజ్ ఈ భామకు వచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచియం అయింది ఈ భామ. తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆర్ఎక్స్ 100 విజయంలో పాయల్‌ది ప్రముఖ పాత్ర. సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది పాయల్. మొదటి సినిమాలోనే అందాల ఆరబోసింది ఈ భామ. దీంతో సినిమా కోసం థియోటర్లకు క్యూ కట్టారు జనాలు.
ఇక సినిమాలో అందంతో పాటు అభినయంతో కట్టిపడేసింది. దీంతో పాయల్ కు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ సినిమా డిస్కో రాజా సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న పాయల్, బెల్లంకొండ సినిమా సీత సినిమాలో ఐటం సాంగ్ చేయనుంది. తాజాగా పాయల్‌కు మరో క్రేజీ ప్రొజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. హీరో, యాక్టర్ రాహుల్ రవింద్రన్ ఇటీవలే దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ నాగర్జునతో మన్మథుడు-2 సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.
రాహుల్ చెప్పిన కథకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశాడట రాహుల్. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పాయల్‌ను మాత్రం మన్మథుడు -2 లో తీసుకున్నారట. ఈ వార్త నిజం అయితే పాయల్ కెరీర్ స్పీడ్ అందుకున్నట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’