నా సావు నేను సస్తా నీకెందుకు అనే డైలాగ్‌తో అందర్నీ ఆకట్టుకున్న పెళ్లిచూపులు ఫేం ప్రియదర్శి త్వరలో లగ్గం జేస్కుంటున్నాడు. గాయన పెళ్లికి అందర్నీ పిలుస్తుండు. మీరు బోరాదు. పెళ్లిచూపులు సినిమాలో హాస్య నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం నాడు తన ప్రేయసిని పరిచయం చేసి ట్వీట్టర్‌లో ప్రేమలేఖ వదిలాడు. తన ప్రేమను వినూత్నంగా తెలిపాడు. ఇప్పుడు ఆమెను ప్రియదర్శికి కాబోయే భార్య.
రిచాశర్మతో ప్రియదర్శి శుక్రవారం (ఫిబ్రవరి 23న) హైదరాబాద్‌లోని ఆగ్రా కాంట్ ప్రాంతంలోని గ్రాండ్ హోటల్‌లో వివాహం చేసుకోనున్నాడు. ఆ తర్వాత మూడు రోజుల అనంతరం వివాహ విందు 26వ తేదీ సాయంత్రం 7 గంటలకు నరేన్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేశాడు. ఈ కార్డును ప్రేక్షకులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
పెళ్లి కోసం ప్రియదర్శి షూటింగ్స్ నుంచి రెండు వారాలు బ్రేక్ తీసుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా తర్వాత పలు సినిమాల్లో ప్రియదర్శి నటించి ప్రేక్షకులను నవ్వించాడు. మొన్న విడుదలైన నాని నిర్మాణంలో వచ్చిన సినిమా అ!లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు.