ఏప్రిల్ 14న ఆలియా రణ్‌బీర్‌ల వివాహం

- Advertisement -

ఇప్పుడు బాలీవుడ్ అంతా ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. వివాహం ఎక్కడ అతిథులు ఎందరు? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి బట్టలు, నగలు దగ్గరినుంచి.. హనీమూన్‌ ఎక్కడ.. ఇలా రకరకాల అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఆలియాభట్‌ సోదరుడు రాహుల్‌ ఆసక్తికర విషయాలువెల్లడించారు. పెళ్లికి కేవలం 28మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారని, వీరిలో ఎక్కువమంది కుటుంసభ్యులేనని పేర్కొన్నారు. మహేష్ భట్ మొదటి భార్య కిరణ్‌ భట్‌ సంతానమే రాహుల్‌ భట్‌.

- Advertisement -

కాగా రాహుల్‌ ప్రకటనను బట్టి చూస్తే బయటి వారు ఎవరికీ ఆహ్వానం ఉండదని తెలుస్తుంది. ఇక పెళ్లి వేడుక ముంబైలోని చెంబూర్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌ బాంద్రా నివాసం అని కూడా వినిపిస్తోంది. త్వరలోనే వేడుక ఎక్కడ అనే అంశంపై స్పష్టత రానుం‍ది.

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

మరో రికార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -