Friday, May 10, 2024
- Advertisement -

ఆమెతో ప్రతీప్ మాచిరాజు డేటింగ్ లో ఉన్నాడు : శ్రీరామోజు సునిశిత్

- Advertisement -

ప్రదీప్ మాచిరాజు బుల్లితెర ఎన్నో షోస్ చేసి టాప్ యాంకర్ గా పేరు సంపాధించుకున్నాడు. ప్రదీప్‌కి ఎఫైర్ ఉందంటూ కామెంట్స్ చేశాడు దర్శకుడు శ్రీరామోజు సునిశిత్. గతేడాది ప్రదీప్ “పెళ్లి చూపులు” అనే షో చేశాడు. ఇందులో జ్ఞానేశ్వరి అనే నటి విజేతగా నిలిచింది.

షోలో భాగంగానే ప్రదీప్, జ్ఞానేశ్వరిలకు పెళ్లి చూపులు జరిగాయి. కానీ ప్రదీప్ మాత్రం జ్ఞానేశ్వరితో డేటింగ్ చేసాడని సునిశిత్ ఆరోపించారు. దీనిపై జ్ఞానేశ్వరి మాట్లాడుతూ రియాక్ట్ అయ్యారు. “నాకు ఈ టీవీ షోలు, సినిమాలపై ఐడియా లేదు. లైఫ్ లో ఎంట్రప్రెన్యూర్ అవ్వాలన్నది నా ఆశ. అందుకే ఓ ఎంఎన్‌సీలో జాబ్ సంపాదించాను. ఆ తర్వాత ఎంబీఏ చేద్దామనుకుంటుంటే.. నా కొలీగ్ ఓ షార్ట్ ఫిలిం తీస్తానన్నాడు. సరదగా అందులో యాక్ట్ చేశాను. అలా సినిమాల్లోకి వచ్చా. పెళ్లి చూపులు షో కూడా అలానే చేశా.

ఇక ప్రదీప్ కి మంచి పేరు ఉందని.. నేను, ఆయన డేటింగ్‌లో ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజం లేదు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అన్నీ 99 శాతం అబద్ధమే ఉంటాయి. నాకైతే ఈ కామెంట్స్ చేసేవాళ్లను చూసి కోపం అయితే రాలేదు. ఎందుకంటే వారికి చెప్పి చెప్పి ఇక నేనే పట్టించుకోవడం మానేసా. ఆ కార్యక్రమంలో జరిగింది పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి చూపులకు, పెళ్లికి చాలా తేడా ఉంది. ఆ రెండిటికి మధ్య ఇంకా చాలా జర్నీ ఉంటుంది. కాబట్టి నా గురించి ప్రదీప్ గురించి ఎవరు ఏమని అడిగినా కూడా వెయిట్ అండ్ సీ అని చెప్తుంటాను’ అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -