Friday, March 29, 2024
- Advertisement -

ఐదు బంతుల్లో ఐదు సిక్సులు.. దట్ ఈజ్ దోనీ..!

- Advertisement -

ధోనీ కి మన దేశంలోనే కాదు ఇతర దేశంలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన బ్యాటింగ్ చేస్తే అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ధోనీ అంటేనే ధనాధన్ అంటారు. బంతిని అలవోకగా బౌండరీ అవతలికి తరలించడంలో ధోనీ సిద్ధహస్తుడు.

2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ భారత్ తరపున ఆడలేదు. ఆయన కెరీర్ పై కూడా పలు అనుమానాలు.. రకరకల వార్తలు వచ్చాయి. ధోనీ శకం ముగిసినట్టేనని పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని ధోనీ నిరూపించాడు. ఐపీఎల్ కోసం ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోనీ ప్రాక్టీస్ కోసం చెన్నై చేరుకున్నాడు.

నిన్న నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది వారేవా అనిపించాడు. ధోనీ విశ్వరూపాన్ని స్టార్ స్పోర్ట్స్ తమిళ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసి క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -