Sunday, May 5, 2024
- Advertisement -

అంత‌లా ‘గూఢ‌చారి’లో ఏముంది?

- Advertisement -

కెరీర్ స్టార్టింగ్‌లో విల‌న్ పాత్ర‌ల‌ను చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడ‌వి శేష్‌.క్ష‌ణం సినిమాతో హీరోగా మారి మంచి విజ‌యం సొంతం చేసుకున్నాడు.ఇక తాజాగా ఆయ‌న క‌థ‌ను అందించి , న‌టించిన చిత్రం గూఢ‌చారి.సినిమా టీజ‌ర్‌,ట్రైల‌ర్‌తోనే అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.మొద‌టి షో నుండే సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది.సినిమా చూసిన వారంద‌రు తెలుగులో ఇలాంటి సినిమా రాలేద‌నే చెబుతున్నారు.

ఇక సినిమాలో అడ‌వి శేష్ న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.సినిమాలో క‌నిపించే ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ప్రాధాన్య‌త‌ను ఇచ్చాడు చిత్ర ద‌ర్శ‌కుడు.జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌కు థియోట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు థ్రిల్‌గా ఫిల్ అవుతార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.మాములుగా సినిమాల‌లో ఒక‌టి,రెండు ట్విస్టులు ఉంటేనే జ‌నాలకు న‌చ్చుతున్నాయి.మ‌రి సినిమా అంత ట్విస్ట్‌లు ఉంటే జ‌నాలు చూడ‌కుండా ఉంటారా? మొద‌టి రోజు వ‌చ్చిన టాక్‌తో సినిమా చూడ‌టానికి జ‌నం క్యూ క‌డుతున్నారు.మ‌రో వారం రోజుల పాటు పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో సినిమాకు క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -