Thursday, May 9, 2024
- Advertisement -

హృతిక్ రోషన్‌పై చీటింగ్ కేసు

- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్‌పై హైద‌రాబాద్‌లో చీటింగ్ కేసు న‌మోద‌య్యింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన శశికాంత్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు పెట్టాడు. ఆయా సంస్థలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సెలబ్రెటీలు చిక్కుల్లో ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్న తారలు ఆయా సంస్థలపై ప్రశంసలు గుప్పిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. వాటిని చూసి వారి అభిమానులు, ప్రజలు ఆ సంస్థల సేవలను పొందేందుకు క్యూ కడుతున్నారు. ఇలాగే ఓ ఫిట్‌నెస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

వివ‌రాల్లోకి వెల్తే…కల్ట్ ఫిట్ హెల్త్ కేర్‌కు హృతిక్ రోషన్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థకు చెందిన ఓ జిమ్ సెంటర్ కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లో ఉంది. వీళ్లు కొన్ని ప్రత్యేకమైన వర్కౌట్లతో బరువు తగ్గిస్తామని చెప్పి 10 నెలల ప్యాకేజీని ప్రకటించారు. ఆ ప్యాకేజీ ధర రూ.36,400 ఉండగా, డిస్కౌంట్ కింద 17,990కి అందజేస్తున్నారు. హృతిక్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌టంతో ఎక్కువ మంది దీనిలో ప్ర‌త్యేక ప్యాకేజీలు తీస‌కున్నారు. అయితే ప‌రిమితికి మించి స‌భ్యులు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌డంతో స్లాట్ క‌టాయించ‌డం క‌ష్టంగా మారింది.

జిమ్ నిర్వాహుకుల‌ను స‌భ్యులు ప్ర‌శ్నిస్తున్నా వారినుంచి స‌మాధానం రాక‌పోవ‌డంతో విసుగు చెందిన శశికాంత్ పోలీసులను ఆశ్రయించాడు. పరిమితికి మించి దరఖాస్తులు స్వీకరించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఎండీ, సీఈవో, మేనేజర్‌లతో పాటు సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న హృతిక్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. సంస్థ నిర్వ‌హాకుల‌తో పాటు హృతిక్‌‌ రోషన్‌పైనా ఐపీసీ 420, 406 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -