- Advertisement -

ది ప్యారడైజ్‌.. క్రేజీ అప్‌డేట్‌!

- Advertisement -

నాని -శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ నుంచి తాజా అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కాయాందు లోహర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో కాయడు లోహర్ రెట్రో స్టైల్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఆమె లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సికింద్రాబాద్ స్లమ్ నేపథ్యంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాని “జడల్” అనే మాస్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, రాఘవ్ , సొనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన “రా స్టేట్‌మెంట్” గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, ఈ చిత్రం 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -