Saturday, May 4, 2024
- Advertisement -

స్టార్ డైరెక్ట‌ర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

- Advertisement -

స్టార్ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్‌కు తమిళంతో పాటు అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్‌లోను క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతున్న మురుగ‌దాస్ ,తాజాగా తెర‌కెక్కించిన సినిమా స‌ర్కార్‌.స్టార్ హీరో విజ‌య్ న‌టించిన ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైంది.ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి క‌లెక్ష‌న్ల విష‌యంలో మాత్రం దూసుకుపోతుంది.ఇక సినిమా చూట్టు వివాదాలు అలుముకున్నాయి.త‌మిళ పురిచ్చి జ‌య‌ల‌లితపై నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయని అన్నాడీఎంకే పార్టీ నేత‌లు ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలో సదరు పార్టీలకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు మురుగదాస్ ని అరెస్ట్ చేయడానికి విరుగంబక్కంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లినట్లు స‌మాచారం.అయితే నిర్మాతలు అప్ప‌టికే సినిమాలోని అభ్యంత‌ర‌క‌ర సీన్స్‌ను తొల‌గించడం జ‌రిగింద‌ని చెప్పడంతో పోలీసులు మురుగ‌దాస్ ఇంటి నుంచి వెళ్లిపోవ‌డం జ‌రిగింద‌ని తెలుస్తుంది.మొత్త‌నికి స‌ర్కార్ సినిమా బాక్సాఫీస్‌తో పాటు రాజ‌కీయాల‌లో కూడా సంచ‌ల‌నం సృష్ఠిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -