Friday, May 10, 2024
- Advertisement -

ప్ర‌భాస్ సినిమాలో పూజా క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా…?

- Advertisement -

కెరియర్ స్టార్టింగ్‌లో లవర్ బాయ్ అవతారంలో అలరించారు ప్రభాస్. ముఖ్యంగా వర్షం, మిస్టర్ పర్ ఫెక్ట్, డార్లింగ్ వంటి చిత్రాల్లో లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టేశాడు. గోపీచంద్ ‘జిల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ ప్రభాస్ కోసం ఓ ప్రేమకథా చిత్రాన్ని రెడీ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫుల్ లెంగ్త్ లవర్ బాయ్‌గా అలరించనున్నారట.

ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా 1960 కాలంనాటి ప్రేమకథగా రూపొందుతుందనీ, శ్రీమంతుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్త ఇటీవలే బయటికి వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్ట‌ర్ ఏంట‌నేది బ‌య‌ట‌కు వ‌చ్చింది. పూజ పేదింటి అమ్మాయిగా కనిపించనుందనేది తాజా సమాచారం.

ఈ పేదింటి అమ్మాయిలో ప్రేమలో అంతటి శ్రీమంతుడు ఎలా పడతాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అనూహ్యమైన మలుపులతో కొనసాగుతూ ఈ కథ కట్టి పడేస్తుందని అంటున్నారు. యాక్షన్ తో కూడిన ఈ ప్రేమకథను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. జిల్ దర్శకుడితో.. జిగేల్ రాణితో ప్రభాస్ జిల్ జిగేల్ మనిపించడం ఖాయమే అంటున్నారు రెబల్ ఫ్యాన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -