అల్లు అర్జున్ ‘డీజే’ సినిమా తర్వాత హాట్ బ్యూటీ పూజ హెగ్డే కెరీర్ పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పూజ. ఈ మధ్యనే ‘అరవింద సమేత’, ‘మహర్షి’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. వెండి తెరపై ఎంత బిజీగా ఉన్నప్పటికీ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తూ ఉంటుంది.
తన హాట్ ఫోటోషూట్ లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ హాట్ బ్యూటీ నెటీజన్లను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక హాట్ ఫోటో ను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ ఉన్న ఫోటోలో పూజ హెగ్డే తన షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా ఫోటోకి ఫోజు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవైపు వెండితెర మీద మాత్రమే కాకుండా ఇటు పూజా హెగ్డే సోషల్ మీడియాలో సైతం తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.
