Wednesday, May 22, 2024
- Advertisement -

వెరైటీ గౌనుతో చేసిన ఫొటో షూట్

- Advertisement -

పూజా హెగ్డే తెలుగులో చేసింది మూడు సినిమాలే అయిన కుర్రకారు హృద‌య్యాల్లో గుబులు రేపింది.‘ఒక లైలా కోసం’.. ‘ముకుంద’ సినిమాలు తనకిచ్చిన ఇమేజ్ విషయంలో చాలా ఫీలైనట్లుంది పూజా హెగ్డే. ‘డీజే’లో బికినీ అందాలతో రెచ్చిపోయిన పూజకు ‘హాట్’ హీరోయిన్ అనే ట్యాగ్ వచ్చేసింది. ఒక్కసారిగా ఆమె రేంజ్ మారిపోయింది. అవకాశాలు పెరిగాయి. పారితోషకమూ పెరిగింది. ఈ హాట్ ఇమేజ్ కాపాడుకోవడానికి తర్వాత కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది పూజ. తాజాగా ఆమె వెరైటీ గౌనుతో చేసిన ఫొటో షూట్ తాలూకు పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బార్బీ బొమ్మలా తయారై ఈ షూట్ చేసింది పూజా. తెల్లటి గౌనులో అందాలు ఆరబోస్తూ.. అట్రాక్టివ్ లుక్స్‌తో చంపేస్తోంది పూజ ఇందులో. సింపుల్‌గా ఉన్న మేకప్ ఆమెకు బాగా సెట్టయింది. ఇలాంటి డ్రెస్సులు అందరికీ సూటవ్వవసలు. పూజ నాజూకు అందాలకు ఈ డ్రెస్ పర్ఫెక్టుగా సెట్టయింది. మరీ ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయకపోయినా.. పూజ ‘హాట్‌నెస్’ ఏమీ తక్కువగా లేదు ఈ ఫొటోలో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -