Monday, May 13, 2024
- Advertisement -

సూర్య గ్యాంగ్….. తమిళ్ టీజర్…. ఇండియన్ రికార్డ్స్ కొట్టేసింది…… తెలుగు టీజర్ డిజాస్టర్… ఎందుకంటే?

- Advertisement -

తమిళ హీరో సూర్యకు తెలుగులో కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది. అలాగే తెలుగు ప్రజలంటే కూడా సూర్య, కార్తీలిద్దరికీ కాస్త అభిమానం ఎక్కువే. తెలుగు మీడియా అంతా మోస్తూ ఉండే రజినీ కూడా ఏం స్పందించనప్పటికీ హుధ్‌హుధ్ టైంలో కోటి రూపాయలు డొనేట్ చేశారు సూర్య, కార్తీలు. అలాగే తెలుగు భాష అంటే కూడా ఇద్దరికీ మక్కువే. ఊపిరి సినిమాకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. కార్తీ గొంతులో తెలుగు భాష కొత్తగా వినిపించింది. ఆ స్పెషల్ ఆకర్షణ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చింది. ఇప్పుడు సూర్య కూడా గ్యాంగ్ సినిమా కోసం తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అయితే తమిళ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ దుమ్ములేపేసింది. హిందీలో వచ్చి సూపర్ హిట్ స్పెషల్ 26కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్ తమిళ నాట రజినీ, అజిత్ సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. అలాగే ఇండియన్ రికార్డ్స్ కూడా సొంతం చేసుకుంది.

తమిళనాట సూపర్ హిట్ అయిన గ్యాంగ్ తెలుగు డబ్బింగ్ టీజర్ మాత్రం నిరాశపర్చింది. అవే విజువల్స్, బ్రహ్మానందం తప్ప ఆర్టిస్టులు కూడా సేం టు సేం. అయినప్పటికీ డబ్బింగ్ పుణ్యమా అని తెలుగు నాట పూర్తిగా డల్ అయిపోయింది. డబ్బింగ్ కోసం డైలాగ్స్ రాసిన రైటర్ కేవలం తమిళ డైలాగ్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసి పత్రికా భాష శైలిలో ఇవ్వడంతో డాక్యుమెంటరీ డైలాగ్స్‌లో తయారయ్యాయి. తమిళ డైలాగ్స్‌లో ఉన్న ఫన్ పోయింది. ఇక సూర్య కూడా ఇంకాస్త బాగా తెలుగు నేర్చుకున్న తర్వాత డబ్బింగ్ చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పటి వరకూ అన్నీ క్వాలిటీ సినిమాలు అందించిన యూవీ క్రియేషన్స్ ఈ డబ్బింగ్ సినిమా టీజర్ మేకింగ్‌లో మాత్రం శ్రధ్ద పెట్టినట్టుగా కనిపించడం లేదు. తమిళ్ టీజర్ చూసిన వాళ్ళకు తెలుగు టీజర్ అస్సలు నచ్చే అవకాశం లేదు. ఇక తెలుగు టీజర్ మాత్రమే చూసినవాళ్ళకు కూడా ఈ సినిమాపైన అంతగా ఆసక్తి క్రియేట్ అవకాశం లేదు. ఇక ఆ బాధ్యత మొత్తం హీరో సూర్య, శివగామి రమ్యకృష్ణలే తీసుకోవాలి.

ఏది ఏమైనా సినిమా కూడా చాలా బాగా వచ్చింది…..సూర్యకు హిట్ ఖాయం అని తమిళ ఇండస్ట్రీ చెప్పుకుంటున్న గ్యాంగ్ సినిమా తమిళ టీజర్ ఆ అంచనాలు అందుకుంది. అందకుమించే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. కానీ తెలుగులో మాత్రం కేవలం నిర్లక్ష్యంగా కారణంగా చేతిలో ఉన్న సినిమాని చెత్తగా చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్ విషయంలో అయినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -