Friday, March 29, 2024
- Advertisement -

పూజ ని కాదనుకున్న వాళ్ళే పిలుస్తున్నారు

- Advertisement -

ఒక లైలా కోసం అనే చిత్రం మొదటగా సైన్ చేసినా కానీ పూజ హెగ్డే కి తెలుగు లో మొదటి విడుదల ముకుంద ద్వారా జరిగింది. తోలి రెండు సినిమా ల తో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ మోహెన్జోదారో సినిమా చేసింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడం తో బన్నీ సరసన తెలుగు లో దువ్వాడ జగన్నాధం లో నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఇక తెలుగు లో పూజ వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. వరుస సినిమాలు, ఎక్కువ మొత్తం లో పార్టీతోషికం తో పూజా ఒక్కసారి గా టాప్ హీరోయిన్ల సరసన నుంచుంది.

అయితే పూజ కోలీవుడ్ లో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. 2012లో మూగమూడి అనే తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తరువాత మరో తమిళ్ సినిమాను చేయలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో పూజ ని పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు పూజ వరుస అవకాశాల తో బిజీ గా మారడం తో మళ్ళి తమిళ దర్శకులు పూజ ని తీసుకొని, పూజ కి ఉన్న క్రేజ్ ని కాష్ చేసుకోవాలని భావిస్తున్నారట. తమిళ ఫిలిం నగర్ సమాచారం ప్రకారం త్వరలో ఆమె సూర్య నటించే సినిమా లో హీరోయిన్ పాత్ర చేయనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -