Tuesday, May 14, 2024
- Advertisement -

మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఫైర్ బ్రాండ్ రోజా….

- Advertisement -

మంత్రి వ‌ర్గంలో త‌న‌కు స్థానం ద‌క్క‌క‌పోవ‌డంపై మౌనంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కచ్చితంగా తన కేబినెట్లో చోటు ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా ప‌క్క‌న బెట్టారు. కొన్ని రాజీకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో రోజాకు మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న సంగ‌తి తెలిసిందే.

మంత్రి ప‌ద‌వి బ‌దులు నామినేటేడ్ ప‌ద‌వులు ఇస్తార‌నె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా విజ‌య‌వాడ చేర‌కున్న రోజా అన్ని ఊహాగానాల‌కు తెర‌దించారు. విజ‌య‌వాడ‌కు రావాల‌ని జ‌గ‌న్ నుంచి పోన్ వ‌చ్చినంద‌ని అందుకే విజ‌య‌వాడ వ‌చ్చింద‌నె వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు.

తనను విజయవాడ ఎవరూ రమ్మని పిలవలేదన్నారు. బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో.. వాటికి హాజరయ్యేందుకే విజయవాడ వచ్చానన్నారామె. తనకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు రోజా. తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ లేదన్నారామె. మంత్రి పదవి రాకపోవడంతో తాను అలిగానని చెప్పడం.. కేవలం మీడియా సృష్టే అని ఆరోపించారు.

మంత్రి పదవి దక్కలేదని బాధలేదన్నారు. సామాజిక సమీకరణాలతో తనకు పదవి దక్కలేదని అభిప్రాయపడ్డారు. తనకు ఏవేవో పదవులంటూ మీడియాలో హైప్ చేశారని.. తనకు ఛానల్ వాళ్లు చాలా పోస్టులు ఇచ్చేశారంటూ సెటైర్లు పేల్చారు. కులాల సమీకరణల వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల లిస్టులో తాను ఫిట్ అవ్వలేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను కులాల్ని ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.

తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధలేదని… రోజా బయటకు అలా చెబుతున్నా.. దీనిపై ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆమె ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపిస్తోంది. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనా ఇన్నాల్లు మౌనంగా ఉన్న ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -