Friday, April 19, 2024
- Advertisement -

వివాదాస్ప‌ద కామెంట్స్ చేసిన పూన‌మ్ కౌర్

- Advertisement -

టాలీవుడ్ లో కాంట్ర‌వ‌ర్సీల‌తో త‌ర‌చు వార్త‌ల్లో ఉండే న‌టీన‌టులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారిలో బాగా విన‌ప‌డే పేరు పూనమ్ కౌర్. సోష‌ల్ మీడియా వేదిక‌గా పూన‌మ్ చేసే పోస్టులు అప్పుడ‌ప్పుడూ వివాదాస్ప‌ద‌మ‌వుతుంటాయి. ఓ స్టార్ హీరోను పూన‌మ్ కౌర్ టార్గెట్ చేస్తుందంటూ ఫిల్మ్ఇండ‌స్ట్రీలో చాలామంది చెవులు కొరుకుంటూ ఉంటారు. తాజాగా పూన‌మ్ కౌర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఈమె చేసిన‌ సినిమాల సంఖ్య ఎక్కువే. కానీ అందులో సూపర్ హిట్ అయ్యి.. తనకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన చిత్రాలు ఒక్కటి కూడా లేవు. తెలుగు, తమిళ, మలయాళంలో చాలా చిత్రాల్లో నటిగా, సహాయ నటిగా గుర్తింపు మాత్రం తెచ్చుకోగలిగింది పూనమ్. అలాంటి తను చాలాకాలం తర్వాత హీరోయిన్‌గా మళ్లీ ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా తన అప్‌కమింగ్ సినిమా ప్రెస్ మీట్‌లో పూనమ్ కౌర్ పాల్గొంది. అయితే చాలారోజుల తర్వాత ఇలా ఓ సినిమా కోసం అందరినీ కలుస్తున్నానన్న విషయం గుర్తుచేసుకొని స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యింది. ఒకానొక సమయంలో తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలని అనుకుందని చెప్పింది. దీంతో పాటు పలు షాకింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

తాను వివాహం చేసుకోవాలనుకున్న ప్రతిసారీ కొందరు వ్యక్తులు కించపరిచారని తెలిపింది. కొందరి కారణంగా ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నా. నేను ఓ సినిమా అవకాశం కోసం ప్రముఖుల దగ్గరకు వెళ్లానని, వారు నాపై కోప్పడ్డారనేది నిజం కాదు. మరొకరిని టార్గెట్‌ చేసే క్రమంలో నన్ను ఓ ఆయుధంగా వాడారంతే అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో కొందరు తన జీవితాన్ని నాశనం చేశారంటూ అంటూ ఎమోష‌న‌ల్ అయింది పూన‌మ్ కౌర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -