ఆ డైర‌క్ట‌ర్‌ మాయ చేయాలని చూశాడు:పూనమ్ కౌర్

సినీ నటి పూనమ్ కౌర్ మ‌రో వివాస్ప‌ద కామెంట్స్ చేసింది.ఎప్పుడు కొన్ని ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూ, అందరిలోనూ ఆలోచనలు రేకింతించే పూనమ్ ఈసారి ఓ డైరెక్టర్‌పై ట్వీట్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.”ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ వున్నాడు. సినిమాలనే కాదు .. మనుషులను కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా డైరెక్ట్ చేయాలని చూశాడు .. అందులో భాగంగా మాయ చేశాడు కూడా.అని ట్వీట్ చేసింది.ఈ విషయంపై వివరణ అడిగితే ఏమి తెలియ‌న‌ట్టుగానే న‌టించాడు అని చెప్పుకొచ్చింది.

అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం పూనమ్ బయటపెట్టలేదు. దాంతో పూనమ్ ఎవరి గురించి ఇలా మాట్లాడి ఉంటుంది? అనేది ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో బాగా పాపుల‌ర్ అయింది పూన‌మ్ కౌర్‌.మ‌ళ్లీ ఈవిధాంగా ట్వీట్ చేసి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపింది.

https://twitter.com/poonamkaurlal/status/994507518003957760