Monday, April 29, 2024
- Advertisement -

సెహ్వాగ్ పై ప్రీతీ జింతా ఆగ్ర‌హం … పంజాబ్ కు జ‌ట్టుకు దూరం కానున్న సెహ్వాగ్

- Advertisement -

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఐతే, సెహ్వాగ్‌ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింతా అనే తెలుస్తోంది

రెండు రోజుల క్రితం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింతా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. రాజస్థాన్‌తో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో 158 పరుగులను ఛేజ్‌ చేయలేక చతికల పడి ఓటమి పాలైంది.

ల‌క్ష్య ఛేదనలో తొలి వికెట్‌ పడిన అనంతరం కరుణ్‌ నాయర్‌, మనోజ్‌ తివారి వంటి ఆటగాళ్లు ఉన్నా అశ్విన్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. అయితే కెప్టెన్‌ పరుగులేమీ చేయకుండానే ఔట్‌ అయ్యాడు. అనంతరం ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఓటమి తరువాత ఆటగాళ్లు డ్రస్సింగ్ రూముకు వెళ్లే క్రమంలోనే సెహ్వాగ్, ప్రీతిల మధ్య మాటల యుద్ధం జరిగిందని సమాచారం. సెహ్వాగ్‌ పలుసార్లు సహనంతో ఓటమికి కారణాలు చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయినా కూడా ప్రీతిజింతా పదేపదే విమర్శలకు దిగుతుంటడంతో వీరూ ఆలోచనలో పడినట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు జాతీయ మీడియా తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -