Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ మళ్లీ తండ్రయ్యాడు

- Advertisement -

జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు.. ఇటు రాజకీయాలతో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తునారు. మరో సినిమాని కూడా పవన్ లైన్ లో పెట్టారు. అలానే పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తున్నారు.

అయితే పవన్ రెణుతీ విడిపోయాకా.. రష్యన్ లేడి అన్నా లెజినావోని మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరికి పొలేనా అనే పాప కూడా ఉంది. ఇప్పుడు మరోసారి పవన్ తండ్రి అయ్యారు. అక్కడమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత పవన్ నందిని అనే పెళ్లి చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. పెళ్లి చేసుకున్న సమయానికి పవన్ వయసు 26, నందిని వయసు 19. మరి ఏవో ఇతర కారణాల చేత పవన్ ఆమెతో కొద్ది రోజులకే విడిపోయాడు.

నందిని చట్టపరంగా విడాకులు తీసుకోకుండానే వేరు వేరుగానే ఉన్నారు. వీరికి పిల్లలు లేరు. బద్రి సినిమా షూటింగ్ సమయంలో రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది.రేణుతో సహజీవనం కారణంగా వీరికి అకీరా అనే కొడుకు పుట్టాడు. అకీరా పుట్టిన తర్వాత రేణుని పవన్ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు.పెళ్లికి ముందు నందినికి విడాకులు ఇచ్చారు..పెళ్లి తర్వాత రేణు కి ఆధ్య అనే కూతురు పుట్టింది.కొద్దిరోజులకు రేణు దేశాయ్ కి కూడా పవన్ విడాకులిచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -