Saturday, May 18, 2024
- Advertisement -

సమంత, చైతుల పెళ్లిపై సిద్దార్థ్ కామెంట్ ఏమని చేశాడు..?

- Advertisement -

సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాములే. తాజాగా చైతన్య,సమంతా ప్రేమించి పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి జరిగి మూడు రోజులు కావస్తున్నా.. వీరిద్దరే సోషల్ మీడియాలో టాపిక్. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తొలిసారి కలిసి నటించిన ఈ జంట.. ఆ తర్వాత కూడా వీరు ఆటోనగర్ సూర్య,మనం సినిమాలల్లో కలిసి నటించారు.

వీరి పెళ్లి గురించి ఇదంతా ఒక టాపిక్ అయితే..నటుడు సిద్దూ చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్.. సిద్దార్ద్,సమంతా కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో జబర్దస్త్ సినిమాలో కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అప్పట్లో వీరు డేటింగ్ లో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సమంత కూడా సైలెంట్ గా ఉండంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తెలుతున్నారని అందరికి అర్ధం అయింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏవో గొడవలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. బ్రేకప్ తర్వాత సమంత ఆరోగ్యపరంగా కూడా బాగా డిస్టర్బ్ అయింది.

ఆ టైంలో నాగచైతన్య సీన్ లోకి వచ్చాడు. సమంతాకి చేరువ అయి ,సామ్ ప్రేమ దక్కించుకున్నాడు. ఆ తర్వాత సినిమాలతో సమంత బిజీ అయిపోయింది. ఇదంతా గతం.. ఇప్పుడు సామ్,చై ల పెళ్లి పై సిద్దూ మీడియా ముందు ఏమి మాట్లాడకపోయినా తన సన్నిహితులతో అన్న మాటల ప్రకారం ఇంతకుముందు మేము రిలేషన్షిప్ లో ఉన్న సంగతి నిజమే అయినా అది కేవలం గతం మాత్రమే. చై సామ్ జంట చాలా బాగుంది అని,చై ఆమెను చాలా ప్రేమిస్తాడు చై తో ఆమె సంతోషంగా ఉంటుంది,ఆమె సంతోషంగా ఉండటమే తనకు కావాలని ఆయన అన్నారు అనే వార్తా సినీ పరిశ్రమలో హల్ చల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -