Saturday, May 4, 2024
- Advertisement -

ట్రెండింగ్..భక్త కన్నప్పలో ప్రభాస్!

- Advertisement -

మంచి విష్ణు చాలా ప్రెస్టెజియస్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం భక్త కన్నప్ప. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలు జరుగగా తాజాగా సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

ఈ సినిమాలో ఆదిపురుష్ ప్రభాస్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. శివుడి క్యారెక్టర్ లో ప్రభాస్ నటించనున్నట్లు సమాచారం. ఈ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో దీని గురించిన వార్త వైరల్‌గా మారగా ఆ వార్తకు మంచు విష్ణు హరహర మహాదేవ్ అని రీ పోస్ట్ చేశాడు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ ఉండటం పక్కా, శివుడి పాత్ర పోషించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా మూవీ భారీ అంచనాల మధ్య మంచు ఫ్యామిలీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా మరీ మంచు ఫ్యామిలీ చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -