Tuesday, May 7, 2024
- Advertisement -

చంద్రబాబు ఎపిసోడ్..వైసీపీకి లాభమా? నష్టమా?

- Advertisement -

అంతా ఊహించినట్లే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ జరిగింది. స్కిల్ డెవలప్‌ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొనగా లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడిని కూడా రిమాండ్ రిపోర్టులో చేర్చింది సీఐడీ. ఇక చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి వారం రోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా చంద్రబాబే తాను అరెస్ట్ అవుతానని ఉహించి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది మాత్రం ఇదంతా జరిగే పనికాదని ఎందుకంటే ఎన్నికల వేళ చంద్రబాబును అరెస్ట్ చేస్తే వైసీపీకి నష్టం జరుగుతుందని వాదించిన వారూ ఉన్నారు.

కానీ సీన్ కట్ చేస్తే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయా? లేదా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయా అన్నదే ప్రశ్నే. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి అమరావతిలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. స్వయంగా అసెంబ్లీలో కూడా జగన్ ప్రకటన చేశారు. డబ్బులు ఎలా చేతులు మారాయో పూసగుచ్చినట్లు వివరించారు. అప్పటినుండి ఐటీ నోటీసుల వరకు చంద్రబాబు అవినీతి స్కిల్స్‌ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు జగన్.

తాజాగా సీఐడీ అధికారుల వివరణతో ప్రజలకు టీడీపీ హయాంలో తప్పు జరిగింది అనేది అర్ధమైంది. అయితే ఆ తప్పులో చంద్రబాబు పాత్ర ఉందా అన్నది ప్రజల్లో అనుమానమే ఉండేది. కానీ సీఐడీ వివరణతో అది కూడా తేటతెల్లం అయిపోయింది. ఇక చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్‌ సర్కార్‌ను సపోర్టు చేసే వారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే కళ్లముందే జరిగిన అవినీతి కనిపిస్తోంది. ఏయే ఏయే కుంభకోణాలు జరిగాయే సీఐడీ స్వయంగా వెల్లడించింది. దీంతో వైసీపీకి ప్రజాక్షేత్రంలో ఇది ప్లస్‌గా మారింది.

ఇక టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌తో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వయస్సుకు విలువ ఇవ్వకుండా రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇక నేటి నుండి ఆ నిరసనలను తీవ్రతరం చేసే ఆలోచనలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. దీని ద్వారా ప్రజల్లో సింపతితో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు.

కానీ ఇది పూర్తిగా బూమారాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబును కోర్టు కస్టడీకి అప్పగిస్తే టీడీపీకి పెద్ద నష్టమే. ఇప్పటివరకు తాను నిప్పు అని చెబుతూ వస్తున్న చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో టీడీపీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపి వైసీపీ మరోసారి గట్టెక్కేందుకే దోహదపడే అవకాశం ఉంది. మొత్తంగా జగన్ సర్కార్ వ్యూహాత్మకంగానే టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -