Monday, May 20, 2024
- Advertisement -

ప్ర‌భాస్ బ‌ర్త్ డే వేడుకుల్లో అప‌శ్రుతి…!

- Advertisement -

నిన్న (మంగ‌ళ‌వారం) టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు పుట్టిన రోజుని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.అయితే అభిమానులు జ‌రుతున్న సంబంరాల‌లో అపశ్రుతి చోటుచేసుకుంది.నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా కొందరు అభిమానులు ఆయన ప్లెక్సీని బైక్ పై పెట్టుకుని ఊరేగింపు చేపట్టారు. అయితే వాహనాలు వేగంగా వెళుతున్న క్రమంలో ఆ ప్లెక్సీ అదుపు తప్పి పక్కనే వెళుతున్న కారు ముందు అద్దంపై పడిపోయింది.

దీంతో రోడ్డుపై ఏముందో కనిపించకపోవడంతో కారు ఒక్కసారిగా రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.దీంతో గాయపడ్డవారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, రోడ్డుపై అడ్డదిడ్డంగా బైక్ లను నడుపుతూ, హారన్లు కొడుతూ ప్రభాస్ అభిమానులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఇలా చేయ‌డం ప‌ట్ల అంద‌రు వారిని విమ‌ర్శిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -