భారత్–వెస్టిండీస్ సిరీస్‌లో నేడు మరో మ్యాచ్ జరగనుంది. సాగర తీర అందాల నగరం విశాఖపట్నం వేదికగా బుధవారం రెండో వన్డే సాగుతుంది. మొదటి వన్డేలో ఘనవిజయం సాధించిన ఇండియా ,రెండో వన్డేలో కూడా విజయం సాధించి సిసీస్‌లో ముందడుగు వేయాలని భావిస్తుంది. రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ జోరుతో రెండో వన్డేలో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో టాప్ త్రయం ధావన్, రోహిత్, కోహ్లిలను కట్టడి చేయడం విండీస్‌కు తలకు మించిన భారమే. వీరు భారీ స్కోర్లు చేయడంలో విఫలమైతేనే రాయుడు, పంత్, ధోనిలకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌కు అవకాశం దక్కుతుంది.
ఆ విధంగా చూసినా, మిడిలార్డర్ సత్తాను పరీక్షకు గురిచేసే ఈ పరిణామం భారత్‌కు ఒకింత మేలే. ఆడగలరు. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే బ్యాటింగ్‌లోనూ కొంత నిలకడ అవసరమే. అత్యంత అనుభవజ్ఞుడైన మార్లోన్ శామ్యూల్స్ తొలి వన్డేలో ఖాతా తెరవలేకపోయాడు. హేమ్‌రాజ్ విఫలమయ్యాడు. హెట్‌మైర్ మెరుపు శతకమే జట్టును కాపాడింది. ఓపెనర్ కీరన్ పావెల్, షై హోప్ నాణ్యమైన బ్యాట్స్‌మెనే. భారీ ఇన్నింగ్స్ ఆడగలరు.నేటి మ్యాచ్ భారత్‌కు 950వ వన్డే కానుంది. ఇప్పటివరకు 949 వన్డేలు ఆడిన భారత్ 490 మ్యాచ్‌ల్లో గెలిచి, 411 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
