Monday, April 29, 2024
- Advertisement -

సాహో స్పీడ్ పెంచాల్సిందే.. ఇది సరిపోదు

- Advertisement -

ప్రభాస్ హీరో గా ఒక సినిమా వస్తుంది అంటే కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు దేశం నలుమూలలా ఉండే వారు అందరూ సినిమా ని తిలకించేందుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా విషయం లో మాత్రం కాస్త జోరు సరిపోవడం లేదు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే అసలు సినిమా రేంజ్ కి తగ్గ ప్రమోషన్స్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఒక వైపు పాటలు పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా, మరో వైపు ఏదో విధం గా సుజీత్ క్యారెక్టర్ పోస్టర్స్ అంటూ హడావుడి చేస్తున్నాడు.

ఈ పోస్టర్స్ కొద్దిగా క్రేజ్ తీసుకొస్తుంది అనుకుంటున్నా తరుణం లో సడన్ గా ప్రభాస్ ఏదో వీడియో రిలీజ్ చేసాడు. జిమ్ లో ప్రాక్టీస్ చేస్తూ, ట్రైనర్ తో, సుజీత్ తో మాట్లాడుతున్న దృశ్యాన్ని కట్ చేసి వదిలారు. కానీ అది ప్రమోషన్స్ కి ఏ మాత్రము ఉపయోగపడినట్లు కనిపించడం లేదు. అయితే అంత పెద్ద సినిమా కి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేయడం ఏంటి అని సగటు ప్రేక్షకుడు అనుకొనే విధం గా నిర్మాతలు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరం. ఇప్పటికైనా ప్రభాస్ రేంజ్ కి తగ్గ ప్రమోషన్స్ మొదలు పెట్టి అందరి చూపు ని సినిమా వైపు తిప్పుకుంటారని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -