పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘అనాన్’ (anan) కవర్‌పై ఒంటరిగా కనిపించిన తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. ఇది ఆయన అంతర్జాతీయ క్రేజ్‌కు మరో నిదర్శనంగా అభిమానులు కొనియాడుతున్నారు.
సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 10న విడుదల కానున్న ‘అనాన్’ మ్యాగజైన్ ఇష్యూ నెంబర్ 2483 యొక్క బ్యాక్ కవర్‌పై ప్రభాస్ ఫోటో ఉండనుంది. జపాన్‌లో సినిమాలు, పాప్ కల్చర్, ఫ్యాషన్‌ను ప్రభావితం చేసే ఈ మ్యాగజైన్లో ప్రభాస్‌కు దక్కిన స్థానం విశేషమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జపాన్ మార్కెట్లో ప్రభాస్ సినిమాలకు ఉన్న ఆదరణ, అక్కడి ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడిన ప్రత్యేక ఫాలోయింగ్ దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
గతంలో 2023లో ‘RRR’ సినిమా ఘనవిజయం నేపథ్యంలో అదే మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి కనిపించారు. అయితే ఈసారి ప్రభాస్ ఒంటరిగా కవర్‌ను అలంకరించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది కేవలం ఒక మ్యాగజైన్ కవర్ మాత్రమే కాదు, భారతీయ సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరించిందో చూపించే ఘట్టంగా అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తాజా గుర్తింపు ఆయన కెరీర్‌కు మరింత గ్లోబల్ బలం చేకూర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
