Monday, April 29, 2024
- Advertisement -

తండ్రి కోరిక‌ను నెర‌వేర్చిన ప్ర‌భాస్‌

- Advertisement -

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయంగా పెంచింది బాహుబ‌లి సినిమా. ఈ సినిమాతో ప్ర‌భాస్ స్థాయి కూడా చాలా పెరిగింద‌నే చెప్పాలి. కానీ ఈ సినిమాతో ప్ర‌భాస్ త‌న తండ్రి సూర్య నారాయ‌ణ రాజు కోరిక‌ను కూడా తీర్చారంట‌. హీరోగా ప్రభాస్‌ను ఏ పాత్రలో చూడాలనకున్నాడో ఆ పాత్రను చూడకుండానే ఈ లోకం విడిచి వెళ్లారు. ఎపుడో కన్నుమూసిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు తీరని కోరిక ఏమిటంటే.. ప్ర‌భాస్‌ను ఆయ‌న ఓ మ‌హారాజు పాత్ర‌లో చూడాల‌నుకున్నారట‌.

బాహుబలి సినిమాలో ప్రభాస్.. మహారాజు పాత్రలో నటించాడు. మహారాజుగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రభాస్‌ను ఆదరించారు. కానీ చనిపోయిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకు మాత్రం ఆ కోరిక తీరకుండానే ఆయన ఈ లోకం విడిచివెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని ప్రభాస్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సాహో చిత్రంలో న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే అంచ‌నాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -