Monday, May 20, 2024
- Advertisement -

అభ్య‌ర్తుల ఎంపిక‌పై దూకుడు పెంచిన టీడీపీ, వైసీపీ….జ‌న‌సేన మాత్రం…?

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారం, అభ్య‌ర్త‌లు, వ్యూహాల‌తో స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌ధానంగా పోటీ చేస్తున్న అభ్య‌ర్తుల ఎంపికే క‌త్తిమీద సాములాంటిది. టికెట్ ఆశించిన భంగ ప‌డ్డ‌వారిని ఎలాగోలా బుజ్జ‌గించి పార్టీని వీడ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ఆపార్టీల అధ్య‌క్షుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌నే ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్న మాట‌.

టీడీపీ, వైసీపీలో అభ్య‌ర్తుల ఎంపిక ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్ర‌క‌టించ‌క పోయినా కొన్ని స్థానాలు మిన‌హా లిస్ట్ రెడీ అయ్యిందంట‌. ఓట్ల‌కోసం బాబు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్డీఏతో నాలుగు సంవ‌త్స‌రాలు క‌ల‌సి ఉండి విడిపోయిన త‌ర్వాత ఎన్నిక‌ల కోసం ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల పేరుతో డ్రామాలు ఆడుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకొనేందుకు వారికి ల‌బ్ధిక‌లిగించేలా కార్పొరేష‌న్‌లు ఏర్పాటు చేశారు. చివర్లో మరిన్ని తాయిలాలకు సిద్ధమయ్యారు. వీలైనంత వరకూ అన్ని వర్గాల వారికీ ఎంతోకొంత లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. ఇక జ‌గ‌న్ కూడా స‌మ‌ర‌శంఖారావంతో మ‌రింత దూకుడు పెంచారు. స‌మ‌ర శంఖారావంలో జిల్లా నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ త‌ట‌స్థంగా ఉన్న వారిని త‌న వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అభ్య‌ర్తుల విష‌యంలో టీడీపీ, వైసీపీ ముందుండాయ‌న‌డంలో సందేహం లేదు. ప‌లువురి సిట్టింగ్‌ల‌కు సీట్లిచ్చేందుకు బాబు సిద్ద‌మ‌య్యారంట‌. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల స్థానాల్లో కూడా స్థానిక టీడీపీ నేతలను బుజ్జగించి వచ్చినవారికి లేదా వారు సూచించిన వ్యక్తులకు సీట్లు ఇవ్వాలనుకుంటోంది. ఇక వైసీపీ కూడా దాదాపు సిట్టింగుల‌కే టికెట్లు ఖ‌రారు చేసింది. మిగిలిన స్థానాల్లో ఎవ‌రు పోటీలో ఉంటార‌నే సంకేతాలు జ‌గ‌న్ ఇచ్చారు. పాద‌యాత్ర‌లో కొంద‌రి అభ్య‌ర్తుల‌ను కూడా ప్ర‌క‌టించారు. 10-20 సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు దాదాపు సిద్ధమైపోయినట్లు స‌మాచారం. ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే టీడీపీ, వైసీపీల‌కంటే వెనుక బ‌డే ఉన్నారు. ఎందుకంటే జిల్లాల వారిగా పూర్తిగా పార్టీకి క్యాడ‌ర్ లేదు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాల‌నేది జ‌న‌సేన‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. 175 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించినా అభ్య‌ర్త‌లు మాత్రం దొర‌క‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -