Saturday, May 11, 2024
- Advertisement -

వర్మ విరుచుకు పడుతున్నాడు!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తెలుగుతో పాటు హిందిలోకూడా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ సినిమా కి సంబంధించి వసులు మొదటి రోజు అద్భుతంగా వచ్చాయి. కానీ సినిమాపై మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా బాబీ దర్శకత్వం వహించడు.

ఐతే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయొద్దని ఎందుకంటే ఒకవేళ సినిమా హిట్ కాకపోతే పవన్ కళ్యాణ్ కంటే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడు అన్న నా మాటలు నిజమయ్యాయని పవన్ పై అతని పక్కన ఉన్నవాళ్ళ పై విమర్శలు ఎక్కుపెట్టాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని మొదట తెలుగులోనే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఆ తర్వాత హిందీ లో కూడా డబ్ చేయాలనీ భావించి డబ్ చేసారు.

అయితే హిందీ వెర్షన్ కు ఓపెనింగ్స్ పెద్దగా లేవు దాంతో వర్మ విరుచుకు పడుతున్నాడు . కనీసం 2 పర్సెంట్ కూడా ఓపెనింగ్స్ తెచ్చుకోలేదని , ఇకనైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరవాలని ….. చెడు సలహాలు ఇచ్చే వాళ్ళ మాటలు వినోద్దని ట్వీట్ చేసాడు వర్మ . పైగా పవన్ ఫ్యాన్స్ కంటే నేనే పవన్ కు పెద్ద ఫ్యాన్ అని అంటున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -