Monday, May 6, 2024
- Advertisement -

దేవర గ్లింప్స్ రెడీ!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 4న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్.

అయితే ఈ ట్రీట్ న్యూ ఇయర్ రోజు కాకుండా 2024 జనవరి 8న ఉండనున్నట్లు తెలుస్తోంది. దేవర గ్లింప్స్‌ను రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు కొరటాల.

జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో కథ సాగనుంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ పాత్రలో తారక్ కనిపించనుండగా గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -