Wednesday, May 1, 2024
- Advertisement -

ఎట్టకేలకు ‘సలార్’ ట్రైలర్ డేట్ లాక్!

- Advertisement -

హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న సలార్‌ మూవీ కోసం ఫ్యాన్స్‌ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా అనేక అవాంతరాల అనంతరం రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానునగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది సలార్. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను డిసెంబర్ 1 నుండి మొదలు పెట్టనున్నారట.

రీసెంట్‌గా టాకీ పార్టు కంప్లీట్ చేయగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ‘సలార్: సీజ్‌ఫైర్‌’ పేరుతో రానుంది. ఇక ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా మూవీ ట్రైలర్‌ని డిసెంబర్‌ 1న విడుదల చేయాలని బావిస్తున్నారట. అంటే సరిగ్గా మూవీ విడుదలకు 20 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా సలార్‌ మేనియాతో మార్మోగిపోనుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఎట్టకేలకు సలార్ ట్రైలర్ డేట్ లాక్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -