Thursday, May 2, 2024
- Advertisement -

బాలయ్యకు మళ్లీ ఇద్దరు భామలు కావాలట!

- Advertisement -

అఖండ,వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్యాక్ టూ బ్యాక్ హిట్‌లతో మంచి జోష్ మీదున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక తర్వాతి ప్రాజెక్టు NBK 109ని కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా ప్రారంభంకాగా ఇందుకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. పోస్టర్‌లో ఓ గొడ్డలి, దానికి గ్లాసెస్ పెట్టారు. అందులో నుంచి కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు బాబీ.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారట. వాస్తవానికి బాలయ్య సినిమాలంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. వాల్తేరు వీరయ్య, బ్రో చిత్రాల్లో ఐటెం సాంగ్ లో నటించిన ఊర్వశి రౌటేలాతో పాటు కలర్ ఫోటో హీరోయిన్ చాందినీ చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారట.

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లెజెండ్ తర్వాత మళ్లీ బాలయ్యతో దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. బాలయ్యకు హిట్స్ మీద హిట్స్ ఇచ్చిన తమన్ ను కాదని దేవికి ఛాన్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -