Tuesday, May 7, 2024
- Advertisement -

Salaar:టీజర్‌లో మార్పులు…ట్రైలర్‌తో ముందుకు!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అదిరే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ప్రభాస్ బర్త్ డే కానుకగా అక్టోబర్ 23న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు ప్రభాస్. ఇక టీజర్ విషయంలో మేకర్స్ సాలిడ్ మార్పులు చేశారు. తొలుత రిలీజ్ చేసిన టీజర్‌కు తాజాగా మార్పులు చేసిన టీజర్‌కు చాలా తేడా ఉంది. గత టీజర్ లో కొన్ని బైక్ షాట్స్ , కొందరు గుర్రాలతో కనిపించే సీన్స్ ని చూపించగా తాజాగా సలార్ సైన్యం తాలూకా ఆర్మీ విజువల్స్ ని యాడ్ చేశారు. అలాగే సెప్టెంబర్ రిలీజ్ డేట్ ని తీసేసి డిసెంబర్ 22 డేట్ అప్డేట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ టీజర్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -