అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు 25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తొలి రోజు నుండే బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బాబు. మరోవైపు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పటివరకు బెయిల్,క్వాష్ పిటిషన్లు వాయిదా పడుతునే ఉన్నాయి.
ఇవాళ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. చంద్రబాబును ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రెండు రోజుల పాటు విచారించగా మరో 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదని న్యాయస్ధానానికి తెలిపింది.
పోలీస్ కస్టడీ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్ పైనా ఒకేసారి వాదనలు జరగనున్నాయి. అలాగే చంద్రబాబుపై పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లపై ఇవాళే విచారణ చేయనున్నారు ఏసీబీ కోర్టు జడ్జి. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
మరోవైపు సీఐడీ నోటీసులపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు.దీంతో విచారణ ఈనెల 10కి వాయిదా వేసినట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే విచారించాలని మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి సూచించింది.
