Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌లో ప్ర‌కాష్ రాజ్ ఏ పాత్ర చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్నాడు ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ‌.ఎన్టీఆర్ పేరుతో తెర‌కెక్కుతున్న ఈసినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఇప్ప‌టికే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టేశారు. ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టీనటుల‌ను తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.ఎన్టీఆర్‌లో న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓ ముఖ్య‌మైన పాత్రను చేస్తున్నాడని స‌మాచారం.

నిర్మాతగా బి. నాగిరెడ్డి పాత్ర ఎన్టీఆర్ సినిమాలో చాలా కీల‌కం కావ‌డంతో ఆ పాత్ర కోసం ప్రకాష్ రాజ్‌ని తీసుకున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ అంటే నాగిరెడ్డికి ఎంత అభిమానమో .. ఆయనంటే ఎన్టీఆర్ కి అంతటి గౌరవం. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అందువలన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నాగిరెడ్డి పాత్రకు ప్రాధాన్యత వుంది. ఈ కారణంగానే ఈ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను అధికారికంగా వదిలారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -