- Advertisement -

ప్రవీన్ సత్తారు.. నీకు సలామ్

- Advertisement -

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు…అనుకున్నట్లుగానే పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. అందరిలా సేఫ్ గేమ్ ఆడటం ఇష్టం లేక చేస్తే గీస్తే మళ్లీ సాహసం చేయాలనే డిసైడ్ అయిపోయాడు. అందుకే ఎవరూ ఊహించని విధంగా ముగ్గురు హీరోలతో కాంబినేషన్ సెట్ చేస్తున్నాడు. దానికి ౩ కజిన్స్ అనే పేరును పెట్టినట్లుగా తెలుస్తుంది.

ఈ సినిమాలో రానా,నితిన్ తో పాటు మరో యంగ్ హీరో నారా రోహిత్ ను తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రానా,నితిన్ లకు ప్రవీన్ సత్తారు చెప్పిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ కథాంశం తెగ నచ్చిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు. నితిన్ ,రానా సనిమాలు కొన్ని సెట్స్ మీదున్నాయి. అవి అయినవెంటనే ఈసినిమా ఉండొచ్చు.

అయితే ఇక్కడ మనం థింక్ చేయాల్సిన విషయం ఏమిటంటే… ప్రవీన్ సత్తారు చేసే ప్రతి ప్రాజెక్ట్ రిస్కీగానే ఉంటుంది. చందమామ కథలు,గుంటూరు టాకీస్ లేటెస్ట్ గా వచ్చిన గరుడవేగ చిత్రాలు మూడు వేటి జోనర్లో అవే ఉన్నాయి.ఇపుడు చేయబోయె కథాంశం చూస్తుంటే ఇది కూడా వినూత్నంగా ఉంది.బహుశ తెలుగు పరిశ్రమలో చేసిన కాన్సెప్ట్ ను చేయకుండా టోటల్ డిఫరంట్ ప్రయత్నం చేస్తున్న ఎకైక టాలీవుడ్ దర్శకుడు ప్రవీన్ ఒక్కడే అనే విషయం అర్ధమైపోతుంది. అలా అయితేనే నేను సినిమాలు చేయగలను అంటోన్న ప్రవీన్ సత్తార్ సత్తాను మనం మెచ్చుకోకుండా ఉండలేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -