తెలుగు తెరపై హార్రర్ కామెడీకి ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. సుధీర్ బాబు, నందితలు హీరో , హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమకథచిత్రమ్. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈసినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలసిందే. ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియోటర్లకు క్యూ కట్టారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించారు. సుమంత్ అశ్విన్ హీరోగా,ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టైటిల్‌ను ప్రేమ కథా చిత్రం 2గా ఫిక్స్ చేశారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మొదటి పార్ట్‌కు మాదిరిగానే రెండో పార్ట్‌ను కూడా కామెడీ హర్రర్ జానర్‌లో తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది.ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు. ప్రేమ కథా చిత్రం 2కు హరి కిషన్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు.
- Advertisement -
ట్రైలర్‌తోనే భయపెడుతున్న ‘ప్రేమ కథా చిత్రం 2’
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -