Friday, May 3, 2024
- Advertisement -

అక్కినేని హీరోకి సూపర్ సెంటిమెంట్

- Advertisement -

అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో అడుగుపెట్టి దాదాపు 7 ఏళ్ళు కావొస్తుంది కానీ ఇప్పటికీ సరైన మాస్ ఇమేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇప్పటికీ లవ్ స్టోరీలతోనే బండి లాగిస్తున్న నాగచైతన్యకి తడాఖా తరువాత ఒక్క మాస్ హిట్ కూడా పడలేదు, కానీ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీలతోనే మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చేసుకుంటున్నాడు నాగచైతన్య.

అందులో ముందుగా సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో రాబోతున్న నాగచైతన్య ఆ సినిమా తరువాత తన కెరీర్ నే మలుపుతిప్పే సినిమా చేస్తున్నాడు. మళయాళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ప్రేమమ్ సినిమా తెలుగు రీమేక్ ప్రేమమ్ ని జులై నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న నాగచైతన్య సినిమాతో పాటు జులై సెంటిమెంట్ ని కూడా గట్టిగా నమ్ముతున్నాడు.

టాలీవుడ్ లో పాత్ బ్రేకింగ్ సినిమాలు ఇంద్ర, సింహాద్రి, మగధీర మరియు బాహుబలి లాంటి సినిమాలు జులై నెలలోనే రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించాయి. కాగా ఇప్పుడు ప్రేమమ్ సినిమాతో టాప్ హీరోల లిస్టులో నాగచైతన్య చేరిపోవడం ఖాయం అని అంతా అంటుండటంతో జులై సెంటిమెంట్ కూడా తనకి నమ్మకం ఇస్తుందని చెబుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -