Thursday, May 16, 2024
- Advertisement -

ప్రేమం అక్టోబర్ కి తోసేసారు

- Advertisement -

రొమాంటిక్ ప్రేమ కథలు , మనసులని హత్తుకునే ప్రేమ కథలూ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఈ తరహా సినిమాలని జనం చాలా ఆసక్తిగా కోరుకుంటున్నారు కానీ వీటిని తీయడానికి కూడా ఎవ్వరూ సాహసించడం లేదు. ప్రేమ కథల మీద జనాలకి ఆసక్తి ఉన్నా ఒక్క డైరెక్టర్ కూడా ఆ సాహసం చెయ్యలేక పోతున్నాడు.

ఇప్పుడు మలయాళం నుంచి తెలుగుకి వచ్చిన ప్రేమం చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. నాగ చైతన్య – శృతి హాసన్ లు ఇద్దరూ లీడ్ రోల్ లో చేసిన ఈ సినిమా ఇప్పుడు విడుదల కి సిద్దం అయ్యింది.  అసలు ఆగస్టు నెలలో జరగాల్సిన ఆడియో ఫంక్షన్ ను.. ఏకంగా సెప్టెంబర్ 20 అక్కినేని బర్త్ డే నాటికి పోస్టుపోన్ చేశారు. ఇప్పటికే ‘ఎవరే’ సాంగ్ బాగా హిట్టయినా కూడా.. ఆడియో మొత్తం కావాలంటే మాత్రం వచ్చే నెల 20 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇకపోతే సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తారట. ఆల్రెడీ అక్టోబర్ లో రామ్ చరణ్ ధృవ – రామ్ హైపర్.. ఇలాంటి పెద్ద సినిమాల లైనప్ అంతా ఉంది. మరి ఆ మధ్యలో ప్రేమమ్ సినిమాను ఎక్కడ ఇరికిస్తారో చెప్పలేం. అది సంగతి.

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -