Wednesday, April 24, 2024
- Advertisement -

అందాల భామ… గ్రాండ్ డ్యాన్స్ కు … కోటి వ్యూస్

- Advertisement -

సిజ్లింగ్ బ్యూటీ దీపికా పదుకునే పద్మావతి ఫిలింకు స్పందన ఓ రేంజ్లో వస్తుంది. ఈసినిమాను బాహుబలికి దీటుగా తీసినట్లు స్పష్టమవుతుంది. టేకింగ్ పరంగానే కాకుండా…రిచ్ లుక్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందుకే పద్మావతి ఫిల్మ్ ప్రమోషన్ అంతగా ఊపందుకుంది.

ఇప్పటికే ట్రైలర్‌కి వచ్చిన స్పందన చూసిన యూనిట్ ..తాజాగా ఘూమర్ సాంగ్ ను రిలీజ్ చేసింది. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తాళ్ చిత్రంలో మాదిరిగా ఈసినిమాలో కూడా పరికిణీలు గుండ్రంగా తిప్పేలా చేస్తూ తీసిన సాంగ్ మరోసారి ప్రేక్షకులను సమ్మోహనానికి గురి చేసింది.

కోటలో దీపిక చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు… ఫిదా అయిపోతున్నారు. చిత్తోర్‌ఘడ్‌ రాణి ‘పద్మావతి’ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మహారావల్ రతన్‌సింగ్‌గా షాహిద్‌కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్‌ సింగ్ ఇందుల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు 24 గంటల్లో దాదాపు 90లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి.తాజాగా అప్ డేట్ ప్రకారం కోటి పదకొండు లక్షల హిట్లు దాటేసాయి. డైరెక్టర్ సంజయ్ లీలా‌ భన్సాలీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ ఒకటిన దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -