Thursday, May 2, 2024
- Advertisement -

ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో ముద్దు స‌న్నివేశాలా…?

- Advertisement -

ప‌విత్ర పుణ్యక్షేత్రంలో అశ్లీల స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌డం సంచ‌ల‌నంగా మారింది.చార్ దామ్ పుణ్యక్షేత్రాలలో ‘కేథార్‌నాథ్‌’ ఒకటి. కేథార్‌నాథ్‌లో ఓ బాలీవుడ్ సినిమా తెర‌కెక్కుతుంది.గ‌తంలో కూడా అక్క‌డ చాలా సినిమాల‌ను తీశారు.అయితే కేథార్‌నాథ్‌లో సినిమాలోని కొన్ని రొమాన్స్ స‌న్నివేశాల‌ను తీశార‌ని స‌మాచారం.హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈ సినిమా ఉందని.. లవ్ జీహాదీని ప్రమోట్ చేసేలా టీజర్ ఉందని అంటున్నారు. కేథార్‌నాథ్‌ కి ముస్లింలు రారని అలాంటిది ముస్లిం అబ్బాయితో హిందూ అమ్మాయి ప్రేమలో పడినట్లు ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు.

కేథార్‌నాథ్‌ లో వరదల కారణంగా వేల మంది మరణిస్తుంటే.. హీరో, హీరోయిన్ల మధ్య అధర చుంబన దృశ్యాలు ఏంటి..? ఈ సినిమాని నిషేధించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. సినిమాను బ్యాన్ చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ స్టార్ సుశాంత్ రాజ్ పుత్ న‌టిస్తుండ‌గా ,హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్‌గా న‌టిస్తుంది.ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ కి పరిచయం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. డిసంబర్ 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -