కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దిగజారుడుతనమేనని బాబుపై, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇతర పార్టీలతో పొత్తు లేకుండా గెలవలేని పరిస్థితిలో చంద్రబాబు ఉంటే, అసలు ఎన్నికల్లో నిల్చుని గెలవలేని స్థితిలో ఆయన కుమారుడు లోకేశ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పిచ్చి మాటలు, పిచ్చి పొత్తులు చూసి ఆయనను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి. తన పాలనపై నమ్మకం సడలిన ప్రతిసారీ ఆయన పొత్తులకు సిద్ధపడతారు. అందుకే రాహుల్ గాంధీని అడ్డుపెట్టుకుని ఓట్లు అడగాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
బాబుతో పొత్తు పెట్టుకున్న వారంతా రాజకీయాల్లో ఎప్పుడో రిటైరైపోయారని ఎద్దేవ చేశారు. పాపం.. రాహుల్ గాంధీ చిన్న వయసులోనే రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ సరే.. కాంగ్రెస్‌తో జత కలిస్తే ఉరి వేసుకుంటానన్న కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు’ అంటూ రోజా ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో బాబు పాదం ఐరన్ లెగ్ టాంటిదన్నారు.
